Mon Dec 23 2024 09:04:23 GMT+0000 (Coordinated Universal Time)
Vijay : హీరో విజయ్ పెట్టిన పార్టీ పేరు.. అర్ధం అదేనట..
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకటించిన కొత్త పార్టీ పేరు అర్ధం ఏంటో తెలుసా?
Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? అనే ప్రశ్నలకు విజయ్ సమాధానం ఇచ్చేస్తూ.. నేడు తన రాజకీయ రంగప్రవేశం పై అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఇప్పటివరకు ‘విజయ్ పీపుల్స్ మూవ్మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు చేస్తూ వచ్చిన విజయ్.. ఇప్పుడు అన్యాయం పై పోరాడడం కోసం.. తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు.
ఇక ఆ పార్టీకి 'తమిళక వెట్రి కజగం' అనే పేరుని పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళనాడుతో పాటు ఇతర స్టేట్స్ లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక విజయ్ రాజకీయ రంగప్రవేశం పై తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పటినుంచో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు 'తమిళక వెట్రి కజగం' అనే తమిళ పేరుతో పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయడంతో.. ఆ పేరు అర్ధం ఏంటని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
అలా సెర్చ్ చేయగా.. 'తమిళక-తమిళ్', 'వెట్రి-విక్టరీ', 'కజగం-క్లబ్' అనే అర్దాలు వస్తున్నాయి. మొత్తం మీద ‘తమిళ విక్టరీ క్లబ్’ అనే మీనింగ్ తో ఆ పార్టీ పేరు వస్తుంది. కాగా ఈ పార్టీతో విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అవినీతి, కులమత విభజన, అధికార దురాచారాలు వంటి సమస్యల పై పోరాటమే ఏజండాగా విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమిళ పాలిటిక్స్ లో పలువురు సినీ ప్రముఖులు తమదైన ప్రభావం చూపించారు. మరి విజయ్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.
Next Story