అలా విజయ్ పారితోషకం బయటికొచ్చింది
తమిళనాట హీరో విజయ్ కి విపరీతమైన క్రేజ్. వరస హిట్స్ తో విజయ్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. రెండు నెలల క్రితం విజయ్ ఆదాయపన్ను ఎగ్గొట్టాడనే సాకుతో [more]
తమిళనాట హీరో విజయ్ కి విపరీతమైన క్రేజ్. వరస హిట్స్ తో విజయ్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. రెండు నెలల క్రితం విజయ్ ఆదాయపన్ను ఎగ్గొట్టాడనే సాకుతో [more]
తమిళనాట హీరో విజయ్ కి విపరీతమైన క్రేజ్. వరస హిట్స్ తో విజయ్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. రెండు నెలల క్రితం విజయ్ ఆదాయపన్ను ఎగ్గొట్టాడనే సాకుతో విజయ్ ఆస్తుల మీద అధికారులు పడడమే కాదు.. ఆఖరుకి విజయ్ ని పట్టుకెళ్లి రెండు రోజులు వరసగా విచారణ జరిపారు కూడా. విజిల్ సినిమాకి కోట్లు అందుకున్న విజయ్ ఆదాయపు పన్ను కట్టలేదని అన్నారు. అలాగే విజయ్ తో పాటుగా విజిల్ నిర్మాతల మీద కూడా పనిలో పనిగా దాడి చేసారు. మాస్టర్స్ సెట్స్ నైవేలీలో షూటింగ్ చేస్తున్న విజయ్ ని అధికారులు పట్టుకెళ్లారు. అయితే విజయ్ మాత్రం నేను సక్రమంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు చెప్పాడు.
బిగిల్ సినిమా పారితోహాకాలు, మాస్టర్ పారితోషకాల విషయంలో ఆదాయపు పన్ను శాఖ విజయ్ మీద కన్నేసింది. విజయ్ బిగిల్ కి 50 కోట్లు పారితోషకం అందుకున్నాడు. అలాగే విజిల్ భారీ హిట్ అవడంతో. మాస్టర్ కి విజయ్ 80 కోట్లు పారితోషకం అందుకోవడంతో ఐటి శాఖ విజయ్ మీద కన్నేసి వరస దాడులు చేస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం కూడా విజయ్ మీద మళ్ళి ఐటి రైడ్స్ జరిగాయి. తమిళనాట బోలెడంత మంది హీరోలుండగా… కేవలం ఐటి శాఖ విజయ్ మీదపడింది. అయితే విజయ్ బిగిల్ పారితోషకం 50 కోట్లకి..మాస్టర్ పారితోషకం 80 కోట్లకి సక్రమంగా పన్ను చెల్లించినట్లుగా ఐటి అధికారులు హీరో విజయ్ ని నిజంగానే రియల్ హీరోని చేసారు. ఈ ఐటి అధికారుల దాడులతో హీరో విజయ్ పారితోషకాలు ఒక్కొక్కటిగా బయటికొచ్చేశాయి అంటున్నారు. ఇక విజయ్ మీద ఐటి రైడ్స్ విషయంలో ఆయన అభిమానులు ఆయనకి అండగా ఉన్నారు. విజయ్ మీద వరస దాడులు జరగడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
- Tags
- విà°à°¯à±