Mon Dec 23 2024 12:30:23 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రి బాటలో కాదు.. తాత దారిలో వారసుడు..
తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన బాటలో కాకుండా తాత దారిలో పయనించేందుకు సిద్ధం అయ్యాడు. దర్శకుడిగా..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) తన సినిమాలతో తమిళంలోనే కాదు సౌత్ లోని పలు భాషల్లో కూడా మంచి స్టార్డమ్ ని సంపాదించుకున్నాడు. కాగా విజయ్.. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్ ఏ చంద్రశేఖర్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 1992లో తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాలైయా తీర్పు’ (Naalaiya Theerpu) సినిమాలో హీరోగా నటించి ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అరగేంట్రంతో పలు విమర్శలు అందుకున్నా.. వాటన్నిటికీ జవాబు ఇస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇక విజయ్ వారసుడు ‘జాసన్ సంజయ్’ (Jason Sanjay) తన తండ్రిలా హీరోగా పరిచయం అవుతాడు అనుకుంటే.. తాను మాత్రం తన తాత దారిని ఎంచుకున్నాడు. ప్రేక్షకులకు హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈ క్రమంలోనే తమిళ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ (Lyca Productions) తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాతలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న కొందరు విజయ్ అభిమానులు.. జాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నా, కొందరు మాత్రం.. హీరోగా తన తండ్రి లెగసీని ముందుకు తీసుకు వెళ్లేలా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పై జనరల్ ఆడియన్స్, నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరో కొడుకు అయ్యుండి.. తన తండ్రిలా హీరో అవ్వాలి అని అనుకుండా, తన టాలెంట్ ని నమ్ముకొని డైరెక్షన్ వైపు అడుగు వేసినందుకు అభినందిస్తున్నారు.
హీరో అవ్వాలని బలవంతం చేయకుండా, తన కొడుకుని తన ప్యాషన్ వైపు వెళ్లేలా ప్రోత్సహించినందుకు విజయ్ ని కూడా అభినందిస్తున్నారు. కాగా జాసన్ సంజయ్ దర్శకుడిగా ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే కొంతమంది అభిమానులు.. హీరో విక్రమ్ తనయుడు దృవ్ విక్రమ్ (Dhruv Vikram) తో చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story