Mon Dec 23 2024 03:46:20 GMT+0000 (Coordinated Universal Time)
కేజీఎఫ్ హీరో ‘యశ్’ రైతులకు ఎంతో సాయం చేస్తాడు.. విశాల్
కేజీఎఫ్ స్టార్ యశ్ చేసే సహాయాలు గురించి తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగు ఆడియన్స్ కి తెలియజేశాడు.
కేజీఎఫ్ చిత్రాలతో ఇండియా వైడ్ భారీ ఫేమ్ ని సంపాదించుకున్న హీరో 'యశ్' (Yash). రాకీ భాయ్ గా తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యశ్ని కన్నడ ప్రేక్షకులు మాత్రం మరో విషయంలో తనని ఎక్కువగా అభిమానిస్తుంటారు. పెద్ద హీరో అవ్వడానికంటే ముందు నుంచే యశ్ వ్యక్తిగతంగా ఎన్నో సహాయాలు చేస్తూ వస్తుండేవాడు. ఈ మనస్తత్వంతోనే కన్నడనాట ఎంతోమంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు.
ఇక తాజాగా యశ్ చేసే సేవల గురించి తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగు ఆడియన్స్ కి తెలియజేశాడు. విశాల్ కూడా తమిళ్, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాడు. ఈ విషయాలు గురించే విశాల్ ని టాలీవుడ్ విలేకర్లు ప్రశ్నించగా, విశాల్ బదులిస్తూ.. కన్నడ హీరో యశ్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అని, కర్ణాటకలో తనకి సంబంధించిన సేవ కార్యక్రమాలు అన్ని యశే చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు.
విశాల్ తను చేసే సేవ కార్యక్రమాలు గురించి బహిరంగంగా చెప్పుకుంటానని, కానీ యశ్ అలా చెప్పుకోడాని వెల్లడించాడు. ఎవరికి తెలియకుండా యశ్ ఎన్నో సహాయాలు చేస్తుంటాడని, ముఖ్యంగా రైతులకు ఎంతో సహాయం అందిస్తుంటాడని పేర్కొన్నాడు. కేవలం విశాల్ కి తెలిసినంత వరకు.. యశ్ ఒక 5 గ్రామంలోని రైతులకు నీళ్లు ఏర్పాటు చేసి, వారికీ ఎంతో సహాయాన్ని అందిస్తున్నాడని వెల్లడించాడు.
ఇంకా తెలియకుండా ఎన్నో సేవలే చేస్తాడని చెప్పుకొచ్చాడు. కాగా విశాల్ కూడా గత కొంత కాలంగా రైతులకు తన చేయూతని అందిస్తూ వస్తున్నాడు. తన రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన టికెట్స్ ని బట్టి.. టికెట్ కి రూపాయి చొప్పున తన సొంత డబ్బులో నుంచి తీసి రైతులకు కావాల్సిన సహాయం అందిస్తూ వస్తున్నాడు. కేవలం ఇలా టికెట్ కి రూపాయి తీయడమే కాకుండా, మరికొంత డబ్బుతో కూడా సహాయాలు చేస్తూ వస్తున్నాడు.
Next Story