Mon Dec 23 2024 15:53:35 GMT+0000 (Coordinated Universal Time)
హీరో ధనుష్ కు భారీ షాక్... నిర్మాత మండలి షరతులివే
తమిళ హీరో ధనుష్ కు తమిళనాడు నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది
తమిళ హీరో ధనుష్ కు తమిళనాడు నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. ధనుష్ సినిమాలు చేయాలంటే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు పదిహేను తర్వాత ఏ కొత్త సినిమాకు అడ్వాన్స్ తీసుకోకూడదని తేల్చిచెప్పింది. ధనుష్ ఇప్పటికే అనేక సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు పూర్తి చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు పదిహేను తర్వాత...
కోలివుడ్ సమస్యలపై ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ధనుష్ సినిమాలు తీయడంపై నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలు చేయాలంటే నిర్మాతల మండలి నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే కొత్త సినిమాలకు నిర్మాత మండలి అనుమతితో అడ్వాన్స్ తీసుకోవాలని మండలి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కింది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Next Story