Tue Dec 24 2024 03:07:01 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ ఆంటోనీ కూతురి రూమ్లో సూసైడ్ నోట్ దొరికింది..!
విజయ్ ఆంటోనీ కూతురి రూమ్లో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికిందట. ఆ లెటర్లో..
ఇటీవల తమిళ నటుడు విజయ్ ఆంటోనీ.. 16 ఏళ్ళ కూతురు 'మీరా' ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం అటు తమిళ్ ఆడియన్స్ ని, ఇటు తెలుగు ప్రేక్షకులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కాగా ఈమె ఆత్మహత్య గల కారణం ఏంటనేది.. పోలీసులు గాని, కుటుంబసభ్యులు గాని ఇప్పటి వరకు తెలియజేయలేదు. అయితే తాజాగా తమిళనాట ఒక న్యూస్ వినిపిస్తుంది. ఆ వార్త సారాంశం ఏంటంటే.. మీరా రూమ్ లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికిందని సమాచారం.
ఆ లెటర్ లో మీరా.. "నేను లేకపోవడంతో నా కుటుంబం ఎంతో బాధ పడుతుందని తెలుసు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను" అని రాసుకొచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లెటర్ గురించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా బయటకి తెలియజేయలేదు. ఇది ఇలా ఉంటే, విజయ్ ఆంటోనీ తన కూతురి మరణం పై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఒక నోట్ రిలీజ్ చేశాడు. "కూతురు మరణంతోనే తను కూడా చనిపోయాను" అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ లెటర్స్ కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం అందరి మనసులను బరువు ఎక్కిస్తున్నాయి.
విజయ్ ఆంటోనీ పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు బాధ పడుతున్నారు. ఆయనకు సోషల్ మీడియా ద్వారా ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విజయ్ ఆంటోనీకి కూడా ఇటీవల పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంతో విజయ్ కూడా చావు అంచులు వరకు వెళ్లి వచ్చాడు. కొన్ని రోజులు పాటు కోమాలోనే ఉన్నాడు. విజయ్ ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ఇప్పుడు కూతురు దూరమైన విషయం తనని మరింత చీకటిలోకి నెట్టేసినట్లు అయ్యింది. కాగా విజయ్ కి మొత్తం ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలే. మీరా పెద్ద అమ్మాయి అయితే, చిన్న అమ్మాయి లారా.
Next Story