Mon Dec 23 2024 00:18:14 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
విడుదలై వారంరోజులవుతున్నా.. ఇప్పటి వరకూ కనీసం కోటిరూపాయలు కూడా వసూలు కాలేదని టాక్. భారీ అంచనాలతో వచ్చిన లైగర్..
ఎగిరెగిరి పడితే ఫలితం ఇలాగే ఉంటుందని.. ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా.. ఆగస్టు 25న భారీ అంచనాల మధ్య విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ వెల్కమ్ లభించిన ఈ సినిమా తొలి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుని.. బోల్తా పడింది.
విడుదలై వారంరోజులవుతున్నా.. ఇప్పటి వరకూ కనీసం కోటిరూపాయలు కూడా వసూలు కాలేదని టాక్. భారీ అంచనాలతో వచ్చిన లైగర్.. చివరికి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు చేదుఅనుభవాన్ని మిగిల్చింది. తాజాగా ఈ సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేశారు. ఎగిరెగిరి పడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. కేవలం సినిమా అనే కాకుండా... ఏ విషయంలో కూడా ఎవరూ ఎగిరెగిరి పడకూడదని చెప్పారు.
తాము కష్టపడి సినిమా చేశామని, సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతూ ప్రమోషన్ చేసుకుంటే బాగుండేదని తమ్మారెడ్డి చెప్పారు. అలా కాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడితే.. సమాధానం ఇలానే ఉంటుందన్నారు. లైగర్ ట్రైలర్ చూసినపుడు సినిమా చూడాలనిపించలేదని, మున్ముందు పూరీపై అభిమానంతో చూడాలనిపిస్తే చూస్తానని తమ్మారెడ్డి తెలిపారు.
Next Story