Mon Dec 23 2024 12:56:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తారకరత్న పెద్దకర్మ.. తరలిరానున్న సినీ, రాజకీయ ప్రముఖులు
రాజకీయంగా పార్టీలు వేరైనా.. కష్టకాలంలో కలిసి నిలబడ్డారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డి సమీప బంధువు..
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న కన్నుమూసి, నందమూరి కుటుంబీకులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తారకరత్న మరణంతో.. అటు నందమూరి, ఇటు నారా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. నేడు తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు. తారకరత్న తనువు చాలించినప్పటి నుంచి ఆ కుటుంబానికి కావలసిన అన్నింటినీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు.
అంతేకాదు.. నేడు నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలిసి చూసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. కష్టకాలంలో కలిసి నిలబడ్డారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డి సమీప బంధువు అన్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల ఇటీవల తారకరత్న పెద్దకర్మ ఆహ్వాన పత్రిక వైరల్ అయింది. అందులో తారకరత్న పెద్దకర్మ తేది, స్థలంతో పాటు ఆహ్వానితులుగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లని రాయడంతో ఈ పత్రిక వైరల్ గా మారింది. మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు.
Next Story