Tue Nov 05 2024 10:38:48 GMT+0000 (Coordinated Universal Time)
2001లో తారకరత్న వరల్డ్ రికార్డ్.. ఆ సినిమాకు నంది అవార్డు
తారకరత్న సినీ కెరీర్ విషయానికొస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మనుమడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత తారకరత్న (39) బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. తారకరత్న మృతితో నందమూరి వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 27న టీడీపీ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురవ్వగా.. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేసి, బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అప్పటి నుంచీ ఆయన కోమాలోనే ఉన్నారని వైద్యులు బులెటిన్లలో పేర్కొంటూ వచ్చారు. ఈ రోజు (ఫిబ్రవరి 18) ఆయన బ్రెయిన్ కు మరోసారి స్కానింగ్ చేశామన్న వైద్యులు.. తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.
తారకరత్న సినీ కెరీర్ విషయానికొస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మనుమడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 20 ఏళ్ల వయసులో హీరోగా తెరంగేట్రం చేశారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే "ఒకటో నెంబర్ కుర్రాడు" సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించారు. తొలి సినిమాతోనే విజయం సాధించడంతో.. అవకాశాలు క్యూ కట్టాయి. హీరోగానే కాకుండా.. విలన్ గానూ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. మొత్తం 22 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ లో తారకరత్న నటించారు.
ఒకటో నంబర్ కుర్రాడు (2002), యువరత్న(2002),తారక్ (2003), నం (2004), భద్రాద్రి రాముడు (2004), పకడై (2006), అమరావతి(2009), వెంకటాద్రి(2009), ముక్కంటి (2010), నందీశ్వరుడు (2011), విజేత (2012), ఎదురు లేని అలెగ్జాండర్(2013), చూడాలని చెప్పాలని (2012), మహా భక్త సిరియాల (2014), కాకతీయుడు (2015), ఎవరు (2016), మనమంతా (2016), రాజా చెయ్యి వేస్తే (2016), కయ్యూం భాయ్ (2017), దేవినేని (2021), సారధి (2022), ఎస్5 నో ఎగ్జిట్ (2022) సినిమాలతో పాటు.. 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో తారకరత్న నటించారు. 2009లో విడుదలైన అమరావతి సినిమా నుంచి తారకరత్న ఉత్తమ ప్రతినాయకుడు (విలన్)గా నంది పురస్కారం అందుకున్నారు.
Next Story