Sat Dec 21 2024 17:44:30 GMT+0000 (Coordinated Universal Time)
కైకాల మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ట్విట్టర్ లో తన సంతాపాన్ని ప్రకటించారు. విభిన్న పాత్రలలో నటించి, విలక్షణ నటనతో నవరస నటనా సౌర్వభౌములు అనిపించుకున్న మేటి నటులని చంద్రబాబు అన్నారు.
టీడీపీ మాజీ ఎంపీగా...
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఆయనతో అనుబంధం మరువలేమని అన్నారు. ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్, సత్యనారాయణ సొంత అన్నదమ్ముల్లా వ్యవహరించేవారన్నారు. కైకాల సత్యనారాయణ మృతి సినీరంగానికి తీరని లోటని ఆయన అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియచేశారు.
రేపు అంత్యక్రియలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపారు. కైకాల మృతి తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. ఆయన పార్ధీవదేహానికి రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలను జరపనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story