Mon Dec 23 2024 16:25:49 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Deverakonda : విజయ్ దేవరకొండకి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ..
విజయ్ దేవరకొండకి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా తన ఫేమ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ ఫేమ్ కేవలం సినిమాలతో వచ్చింది మాత్రమే కాదు. తన వ్యక్తిత్వంతో అభిమానుల మనసు దోచుకుంటూ వెళ్తున్నాడు. తనకి వచ్చే విజయాన్ని, సంపాదనని.. తనని అభిమానించే వ్యక్తులతో పంచుకుంటూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.
ఈక్రమంలోనే ఇటీవల తన సినిమా 'ఖుషి' మంచి విజయం సాధించడంతో.. ఆ సినిమా నుంచి వచ్చిన కోటి రూపాయిలను ఆర్ధిక సాయం కావాల్సిన ఒక వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అందించాడు. ఇలా సాయం అందుకున్న వ్యక్తుల్లో శ్రీకాకుళం కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన 'షర్మిల శ్రీ' అనే పాప కుటుంబం కూడా ఉంది. ఈ పాప ఒక యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంది.
దీంతో ఆ పాప కుటుంబం హాస్పిటల్స్ ఖర్చులతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక ఈ విషయాన్ని అభిమానులు విజయ్ కి తెలియజేయగా.. ఖుషి మూవీ సక్సెస్ లో భాగంగా ఈ కుటుంబానికి కూడా లక్ష రూపాయలు అందజేసి వారికీ తోడుగా నిలిచాడు. తాజాగా ఆ లక్ష రూపాయిల చెక్ ని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు చేతులు మీదుగా ఆ కుటుంబానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందజేశారు.
ఇక దీని గురించి ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "విజయ్ దేవరకొండ గారు 'దైవం మనుష్య రూపేణ' అనే పదానికి నిర్వచనంగా నిలుస్తున్నారు. ఈ కుటుంబానికి సహాయం చేసినందుకు హీరోగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలాగానే నేను ఈ కుటుంబానికి అండగా నిలబడతానని మాట ఇస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story