Mon Dec 23 2024 03:57:02 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ కి వెళ్తున్న బింబిసార ?
బింబిసార సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేశారు. తెలుగులో రెస్పాన్స్ బాగుంటే మిగతా భాషల్లో సినిమాను విడుదల చేస్తామని..
కల్యాణ్ రామ్ ప్రధానపాత్రలో.. సొంత బ్యానర్లో నిర్మితమై ఆగస్టు 5న విడుదలై.. విజయవంతంగా రన్ అవుతోన్న సినిమా బింబిసార. వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలిరోజు మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు.. కల్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా బింబిసార నిలిచింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఆడియన్స్ ను అలరించారు. కల్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ లు నటించారు.
కాగా.. బింబిసార సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేశారు. తెలుగులో రెస్పాన్స్ బాగుంటే మిగతా భాషల్లో సినిమాను విడుదల చేస్తామని కల్యాణ్ రామ్ ప్రమోషన్స్ సమయంలో చెప్పారు. అనుకున్నట్లే తెలుగులో బింబిసార భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ముందుగా హిందీలో బింబిసారను విడుదల చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా హిందీలో భారీ వసూళ్లు చేస్తుండగా.. బింబిసారను కూడా ముందుగా అక్కడే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 13 రోజుల థియేట్రికల్ రన్ లో బింబిసార రూ.30 కోట్ల షేర్ వసూలు చేసింది. మరోవారంరోజుల్లో ఈ సినిమా రూ.35 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
Next Story