Mon Dec 23 2024 17:08:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ నుంచి టీజర్ పోస్టర్.. రాముడిగా ప్రభాస్ లుక్
ఆకాశానికి బాణం ఎక్కుపెట్టిన రాముడిగా ప్రభాస్ మైమరపిస్తున్నాడు. ఆదిపురుష్ చిత్ర టీజర్ను అక్టోబర్ 2న సాయంత్రం..
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా రూపొందిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ ను అయోధ్యలో విడుదల చేస్తుండగా.. నేడు టీజర్ పోస్టర్ ను విడుదల చేశారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా టెర్రిఫిక్ గా ఉంది.
ఆకాశానికి బాణం ఎక్కుపెట్టిన రాముడిగా ప్రభాస్ మైమరపిస్తున్నాడు. ఆదిపురుష్ చిత్ర టీజర్ను అక్టోబర్ 2న సాయంత్రం 7.11 గంటలకు అయోధ్యలోని సరయు నది ఒడ్డున రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. లంకేశుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story