Mon Dec 23 2024 07:51:11 GMT+0000 (Coordinated Universal Time)
HanuMan : హనుమాన్ మూవీకి బీజేపీ సపోర్ట్.. తేజ సజ్జకి అవమానం..
హనుమాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జకి అవమానం. హనుమాన్ మూవీకి బీజేపీ, బజరంగ్ దళ్ సపోర్ట్ చేస్తుందా..?
HanuMan : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ.. 'జాంబీ రెడ్డి' తరువాత మరోసారి కలిసి తెరకెక్కిస్తున్న సినిమా 'హనుమాన్'. ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రామభక్త హనుమాన్ వల్ల ఒక కుర్రోడికి శక్తులు రావడం, అతడు అన్యాయం పై పోరాటం చేయడం అనేదాని అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి మీడియా వారి మధ్య రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో సినిమా విషయాలు పంచుకున్నారు.
ఈ ఇంటరాక్షన్ లో ఓ విలేకరి.. హనుమాన్ చిత్ర నిర్మాణంలో బజరంగ్ దళ్ కి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. దానికి తేజ సజ్జ బదులిస్తూ.. వాళ్ళు నన్ను సంప్రదించారండి. నేను వారిని ఒకటే కోరాను. మా సినిమాని నలుగురికి తెలియజేయండి అని చెప్పను. అంతేతప్ప వాళ్ళకి మా సినీ నిర్మాణంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇక మరో విలేకరి ప్రశ్నిస్తూ.. "ఈ చిత్రానికి బీజేపీ సపోర్ట్ ఉందా?" అని అడగగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ బదులిస్తూ.. "ప్రస్తుతం అయితే వారి నుంచి ఏ సంబంధం లేదండి. కానీ సినిమా విడుదల అనంతరం కచ్చితంగా వస్తుంది" అని వెల్లడించారు.
ఇక ఇదే ఇంటరాక్షన్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విలేకరి ఏం అడిగాడంటే.. "ఈ సినిమా స్థాయి చాలా పెద్దగా ఉంది. కానీ మీరు చిన్న హీరో. ఈ సినిమా చేసేటప్పుడు మీ స్థాయి దాటి వెళ్లారని మీకు అనిపించిందా?" అని ప్రశ్నించారు. దానికి తేజ బదులిస్తూ.. "స్టార్ ఫ్యామిలీస్ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు కెరీర్ స్టార్టింగ్ లో తమ మార్కెట్ ని మించిన స్థాయిలో సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఇలాగే ప్రశ్నిస్తారా. నేను వాళ్ళు ఒకటే అని నేను అనడం లేదు. కానీ నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు చేరుకున్నాను. హీరోగా నిలబడడం కోసం ఎంతో కష్టపడుతున్నాను. వారసులు అయినా హీరోలుగా నిలబడానికి ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం నాకు హనుమాన్ వల్ల వచ్చింది. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలని నేను కష్టపడితే.. మీరేమో నా స్థాయి అని తక్కువ మాట్లాడి నన్ను చిన్న చూపు చూస్తూ అవమానిస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story