Sun Dec 22 2024 21:47:11 GMT+0000 (Coordinated Universal Time)
Hanuman : ‘హనుమాన్’కి థియేటర్స్ ఇవ్వడం లేదా..?
హనుమాన్ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం లేదా..? ఆ సినిమా ప్రమోట్ చేయడానికి కూడా స్టార్ హీరోస్ రావడం లేదా..?
Hanuman : టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. శ్రీరామ భక్తుడు హనుమంతుడి పవర్స్ ద్వారా ఒక సూపర్ హీరో పుట్టుకొస్తే.. అతడి కథ ఎలా ఉండబోతుందో ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా.. జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అయితే ఈసారి సంక్రాంతికి సినిమాల సందడి కొంచెం ఎక్కువ గానే ఉంది. హనుమాన్ రిలీజ్ రోజునే మహేష్ బాబు 'గుంటూరు కారం' కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే వెంకటేష్ 'సైంధవ్', రవితేజ 'ఈగల్', నాగార్జున 'నా సామీ రంగ' కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇంతమంది పెద్ద హీరోల మధ్య తేజ వంటి చిన్న హీరో సినిమాకి థియేటర్స్ దొరకడం అంటే కష్టమే.
కానీ ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కి నేషనల్ వైడ్ భారీ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి రేసులో ఉన్న మిగిలిన ఏ స్టార్ హీరో సినిమాకి ఆ రేంజ్ రెస్పాన్స్ లేదు. హనుమాన్ హీరో చిన్నవాడైనా సినిమా మాత్రం భారీ స్థాయిలోనే రూపొందింది. అయినాసరి టాలీవుడ్ లో ఈ చిత్రానికి థియేటర్స్ ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన సిటీలు అయిన హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో కేవలం చేతి వేళ్ళ మీద లెక్కబెట్టే థియేటర్స్ మాత్రమే హనుమాన్ కి కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో మూవీ టీం చాలా ఫీల్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక అలాగే హనుమాన్ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా స్టార్స్ రావడానికి పెద్ద ఆసక్తి చూపించడం లేదని మూవీ టీం పేర్కొంది. టీజర్ రిలీజ్ టైములో కొందర్ని అడిగినా.. వారు రాలేము అని చెప్పారట. దీంతో హనుమాన్ టీం ఒంటరిగానే ప్రమోషన్స్ చేసుకుంటున్నారట. మరి ఇన్ని ఇబ్బందులు మధ్య ఈ చిన్న సినిమా ఆడియన్స్ లోకి ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.
Next Story