Sun Dec 22 2024 21:15:53 GMT+0000 (Coordinated Universal Time)
HanuMan : అయోధ్యకు 'హనుమాన్' టీం భారీ విరాళం..
హనుమాన్ మూవీ మాట చెప్పినట్లు.. తమ మూవీ టికెట్ నుంచి రూ.5 అయోధ్య రామ మందిరంకి విరాళంగా పంపిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతంటే
HanuMan : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన కొత్త సినిమా 'హనుమాన్'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. సినిమా విడుదలయ్యి వారం పైనే అవుతున్నా ఇంకా హౌస్ ఫుల్ షోలు పడుతూ సత్తా చాటుతుంది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.
కాగా ఈ మూవీ రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్.. మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఓ ప్రకటన చేసింది. ఈ సినిమాకి అమ్ముడు పోయే ప్రతి టికెట్ నుంచి ఒక రూ.5 అయోధ్య రామ మందిరం కోసం విరాళంగా ఇస్తామంటూ మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాట ప్రకారమే ఇప్పటివరకు అమ్ముడుపోయిన టికెట్స్ నుంచి అయోధ్యకు వెళ్లిన విరాళం గురించి మూవీ టీం తెలియజేసింది.
ఇప్పటివరకు 53,28,211 టికెట్స్ అమ్ముడు పోయినట్లు తెలియజేశారు. ఇక టికెట్స్ నుంచి రూ.5 అంటే.. రూ.2,66,41,055 విరాళం అయోధ్య రామ మందిరంకు ఇచ్చినట్లు మూవీ టీం అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం థియేటర్స్ వద్ద ఈ మూవీ సందడి ఇప్పటిలో తగ్గేలా కనిపించడం లేదు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇంకెంతటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో, అయోధ్యకి ఇంకెంత విరాళం పంపిస్తుందో చూడాలి.
Next Story