Sun Dec 22 2024 20:01:28 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ మూవీ ఈ కుర్రోడి దశ తిప్పేసిందా?
తెలంగాణ కుర్రోడు రామగిరి విష్ణు సలార్ మూవీలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు
ప్రభాస్ నటించిన సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారి ప్రభాస్ మూవీలో పనిచేస్తే చాలని చాలా మంది పరితపిస్తుంటారు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రభాస్ సినిమాలో పనిచేస్తే చాలు తమ ఫ్యూచర్ సెటిలయినట్లేనని చాలా మంది భావిస్తారు. అయితే సలార్ మూవీలో తెలంగాణ యువకుడికి అరుదైన అవకాశం దక్కింది. సలార్ మూవీలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసే అవకాశం లభించింది. ఈ అరుదైన అవకాశాన్ని ఈ కుర్రోడు చక్కగా వినియోగించుకుని పలువురి ప్రశంసలను పొందుతున్నాడు.
కడెంకు చెందిన...
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కడెంకు చెందిన రామగిరి విష్ణు సలార్ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. అయితే ఇతను ఎడిటింగ్ పనులను ఎక్కడా శిక్షణ పొంది నేర్చుకోలేదు. కేవలం యూట్యూబ్ లోనే ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు. తాను ఎడిటింగ్ చేసిన వీడియోలను పలువురు సినీ దర్శకులకు చూపించి ప్రశంసలను పొందాడు. చివరకు సలార్ మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. అంతకు ముందు మ్యాడ్ సినిమాలో విష్ణు పనిచేశాడు. తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్ సినిమాలకు పనిచేస్తున్నాడు. దీంతో అనేక మంది విష్ణును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Next Story