Sun Dec 22 2024 09:31:59 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో "రాధేశ్యామ్" 5 షోలు ప్రదర్శన
రేపే రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో రోజుకు ఐదు షో లను ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తూ ..
హైదరాబాద్ : భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డేలు హీరోహీరోయిన్లుగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. సినిమా విడుదలకు మరికొద్దిగంటల సమయం మాత్రమే ఉంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు.. సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి.
రేపే రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో రోజుకు ఐదు షో లను ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నంబర్ 10ని జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకూ షోలను వేసుకునేందుకు థియేటర్లకు అనుమతులిచ్చింది. అర్థరాత్రి 1 గంటల తర్వాత నుంచి ఉదయం 10 గంటల్లోపు ఎలాంటి షోలను ప్రదర్శించకూడదని జీఓలో స్పష్టం చేసింది.
News Summary - Telangana Government Releases GO on Allowing fifth show for Radhe Shyam
Next Story