Sat Dec 21 2024 18:37:20 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. అతిథులుగా తెలంగాణ మంత్రులు
ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ మంత్రులు ముఖ్య అతిథు
పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈనెల 25వ తేదీన తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అంతకన్నా ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఒక డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ మంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.
Also Read : ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రెండు పోస్టర్లను విడుదల చేసింది. భీమ్లా నాయక్ అఫీషియల్ ట్రైలర్ ను కూడా 21నే విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమాకు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ సంగీతం అందించగా.. ఇప్పటికే ఆ పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
News Summary - Telangana Ministers KTR and Talasani Will Attend Bheemla Nayak Pre Release Event as Special Guests
Next Story