Mon Dec 23 2024 17:57:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
స్పెషల్ కేటగిరీ థియేటర్లు, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడ్రోజులు 100 రూపాయలు, తర్వాతి వారంరోజులు 50 రూపాయలు..
హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ఇచ్చింది. మామూలుగా పెద్దహీరో సినిమా విడుదలైతే టికెట్లు భారీ రేట్లకు అమ్ముడుపోవడం ఖాయం. ఆర్ఆర్ఆర్ సినిమా మరో వారంరోజుల్లో విడుదల కానుండగా.. సాధారణ థియేటర్లో టికెట్ రేటుపై మొదటి మూడ్రోజులురూ.50, తర్వాత వారంరోజులు రూ.30 వరకూ టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
అలాగే స్పెషల్ కేటగిరీ థియేటర్లు, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడ్రోజులు 100 రూపాయలు, తర్వాతి వారంరోజులు 50 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. మార్చి 25 నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇలా తెలంగాణ సర్కార్ ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ నజరానా ప్రకటించింది. ఇటీవలే ఏపీలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే బెనిఫిట్ షో లకు కూడా ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆర్ఆర్ఆర్ కు లైన్ క్లియర్ అయింది. ఇక కలెక్షన్ల మోత మోగడం ఖాయం.
Next Story