Mon Dec 23 2024 06:51:17 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లితో ఒక్కటైన బుల్లితెర హీరో-హీరోయిన్.. వెల్లువెత్తుతోన్న విషెస్
తాజాగా బెంగళూరులో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఐదురోజుల పెళ్లి వేడుకలో భాగంగా..
సినీ ఇండస్ట్రీలోనే కాదు.. బుల్లితెరలోనూ కొందరు సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు. తాజాగా మరో బుల్లితెర హీరో-హీరోయిన్ ఆ కపుల్స్ లిస్ట్ లోకి చేరిపోయారు. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే C/O అనసూయ సీరియల్ హీరోయిన్.. తేజస్విని గౌడ, జానకి కలగనలేదు హీరో అమర్ దీప్ లు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.
తాజాగా బెంగళూరులో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఐదురోజుల పెళ్లి వేడుకలో భాగంగా.. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లికూతురి ఫంక్షన్, పెళ్లికొడుకు ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్, పెళ్లి ఘనంగా నిర్వహించారు. వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతుండగా.. అభిమానుల నుండి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తేజు - అమర్ దీప్ ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Next Story