Fri Dec 20 2024 06:43:26 GMT+0000 (Coordinated Universal Time)
లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానంటూ ప్రకటించిన హీరోయిన్..
లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానంటూ ప్రకటించిన తెలుగు హీరోయిన్ శ్రీ దివ్య.
తెలుగు అమ్మాయి శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. రవిబాబు తెరకెక్కించిన 'మనసారా' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరువాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించనప్పటికీ.. ఇక్కడ మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ ప్రయత్నించగా.. వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా 'రైడ్' అనే సినిమాలో నటించింది.
ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న శ్రీ దివ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "త్వరలోనే చేసుకోబోతున్నాను. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతున్నా. ఈ ప్రేమ వివాహం గురించి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఆ ప్రియుడు ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ తో శ్రీదివ్య కూడా ప్రేమలో ఉందని అర్ధమయ్యింది. అయితే ఆ వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తా..? లేదా బయట అతనా..? అనేది తెలియాల్సి ఉంది. మరి శ్రీ దివ్య తన ప్రియుడిని ఎప్పుడు పరిచయం చేస్తుందా చూడాలి. కాగా శ్రీ దివ్య హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఆమె సిస్టర్ శ్రీ రమ్య కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.
Next Story