Mon Dec 23 2024 11:08:59 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ 'OG'లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా..?
పవన్ కళ్యాణ్ OG సినిమాలో తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ అవకాశం అందుకున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. OG మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కూడా ఈ సినిమా సెట్స్ లోనే పాల్గొంటున్నట్లు సమాచారం.
'సాహో' ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నారు. తమిళ యాక్టర్స్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీలో తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ అవకాశం అందుకున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు..?
ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 జరుగుతుంది. ఈ సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఐదో వారమే బయటకి వచ్చేసిన కంటెస్టెంట్ 'శుభశ్రీ రాయగురు'. ఈ భామ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్గా, అలాగే టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఈ అవకాశాలు వల్ల ఇండస్ట్రీ వరుకే గుర్తింపు సంపాదించుకున్న శుభశ్రీ.. బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది.
దీంతో ఇప్పుడు పెద్ద సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. అది కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ OG కావడం విశేషం. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ శుభశ్రీ.. OG మూవీ సెట్స్ లోని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆడియన్స్.. ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా ఈ సీజన్ లోని మరో కంటెస్టెంట్ అయిన 'రతిక' కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల ఈ భామ స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నట్లు తెలియజేసింది. అయితే రతిక ప్రస్తుతం మళ్ళీ బిగ్‌బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అది హోల్డ్ లో పడింది.
Next Story