Mon Dec 23 2024 06:41:09 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 7 : రికార్డు క్రియేట్ చేసిన రైతుబిడ్డ.. బిగ్బాస్ హిస్టరీలో..
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 కూడా ముగిసింది. ఇక ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ రికార్డు క్రియేట్ చేశాడు.
BiggBoss 7 : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 కూడా ముగిసింది. 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ మొదలవ్వగా.. ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ సీజన్ లో ఆల్మోస్ట్ ఆడియన్స్ కి తెలిసిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రైతు బిడ్డ అనే ట్యాగ్ తో వచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ సీజన్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఫైనల్స్ వరకు చేరుకున్నాడు. ఫైనల్స్ కి శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రియాంక వచ్చారు.
ఇక ఫినాలే ఎపిసోడ్ లో మొదటిగా అర్జున్ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. ఆ తరువాత ఫైనల్స్ లో నిలిచి ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక.. సెకండ్ ఎలిమినేషన్ గా ఫైనల్ రేసులో అవుట్ అయ్యింది. ఆ తరువాత యావర్ సెల్ఫ్ ఎలిమినేషన్ తో బయటకి వచ్చేశాడు. 15 లక్షల సూట్ కేసు కావాలా..? టైటిల్ కావాలా..? అని ఆఫర్ ఇవ్వగా.. యావర్ సూట్ కేసుతో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. దీంతో ఫైనల్ త్రీలో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్ మిగిలారు.
ఈ ముగ్గురి కంటెస్టెంట్స్ లో శివాజీ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశాడు. శివాజీ ఎలిమినేట్ అవ్వడంతో ప్రశాంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. హౌస్ లో తనని ఇన్నాళ్లు నడిపించిన శివాజీ కళ్ళు పట్టుకొని మరి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక టాప్ 2గా ఫినాలే స్టేజి మీదకి వచ్చిన అమర్, ప్రశాంత్ ల్లో విజేత ఎవరనేది నాగార్జున తెలియజేశారు. రైతు బిడ్డని విన్నర్ గా ప్రకటించడంతో బిగ్బాస్ హిస్టరీలో రికార్డు క్రియేట్ చేసినట్లు అయ్యింది.
ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఆరు సీజన్ లో సెలబ్రిటీసే విజేతలుగా నిలిచారు. కానీ మొదటిసారి బిగ్బాస్ విజేతగా కామన్ మ్యాన్ టైటిల్ గెలుచుకున్నాడు. బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచి తెలుగు బిగ్బాస్ హిస్టరీలో రికార్డు క్రియేట్ చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవ్వడంతో తన అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.
Next Story