Mon Dec 23 2024 06:41:10 GMT+0000 (Coordinated Universal Time)
Pallavi Prashanth : జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్.. కానీ..
జైలు నుంచి రిలీజైన పల్లవి ప్రశాంత్. కానీ కొన్ని షరతులు ఉన్నాయి.
Pallavi Prashanth : తెలుగు బిగ్బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్బాస్ ఫైనల్ రోజున కొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్థులను సైతం ధ్వంసం చేయడం వంటి దాడులతో.. లా అండ్ ఆర్డర్ ని అతిక్రమించి ప్రవర్తించారు.
ఇక చర్యలకు సీరియస్ అయిన హైదరాబాద్ పోలీసులు.. పల్లవి ప్రశాంత్, అతడి తమ్ముడిని A1 A2గా చేర్చి కేసు నమోదు చేశారు. అలాగే దాడిలో పాల్గొన్న అభిమానుల పై కూడా పలు సెక్షన్ల కింద కేసుని నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, సోదరుడు రాజుని అరెస్ట్ చేయగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలుకి తరలించారు.
గురువారం నాడు పల్లవి ప్రశాంత్ తరుపు న్యాయవాది బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. వాదనలు విన్న కోర్టు.. పల్లవి ప్రశాంత్కు, సోదరుడు రాజుకి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. దీంతో నాలుగు రోజులు పాటు జైలులో ఉన్న పల్లవి ప్రశాంత్ నేడు చంచల్ గూడా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అవుతున్న పల్లవి ప్రశాంత్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఇంతకీ పల్లవి ప్రశాంత్ కి కోర్టు ఇచ్చిన షరతులు ఏంటంటే.. కేసు ముగిసే వరకు ప్రతి నెల 1వ తారీఖు, 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అంటే పల్లవి ప్రశాంత్ ప్రతి 15 రోజులకు ఒకసారి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కి రావాల్సి ఉంది.
Next Story