Mon Dec 23 2024 15:29:37 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Jain : పెళ్లి అప్డేట్ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ..
బిగ్బాస్ హౌస్ లో ప్రియుడిని పరిచయం చేసిన ప్రియాంక జైన్.. పెళ్లి పై అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది.
Priyanka Jain : మౌనరాగం, జానకి కలగనలేదు వంటి తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక జైన్.. ఈ ఏడాది బిగ్బాస్ సీజన్ 7లో కాంటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక హౌస్ లో ఉన్న సమయంలో ప్రియాంక తన ప్రియుడిని అందరికి పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఫ్యామిలీ ఎపిసోడ్ టైములో తన తోటి సీరియల్ యాక్టర్ శివ కుమార్ ని అందరికి తన ప్రియుడిగా పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకి వచ్చాక పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇక బిగ్బాస్ ముగిసింది, దీంతో వారిద్దరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అందరూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రియాంక ఈ పెళ్లి గురించి అప్డేట్ ఇస్తూ ఓ యూట్యూబ్ వీడియో రిలీజ్ చేసింది.
తన ప్రియుడు శివ కుమార్ తో కలిసి ప్రియాంక జైన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. ప్రతి ఒక్కరు తమ పెళ్లి వార్త గురించి అడుగుతున్నారని, 2024లో కచ్చితంగా చేసుకుంటామని ఆ వీడియోలో పేర్కొన్నారు. పెళ్ళికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ త్వరలోనే ఇస్తామంటూ, దయచేసి అప్పటివరకు పదేపదే ఆ విషయం గురించి ప్రశ్నించకండి అంటూ కోరారు. కాగా బిగ్బాస్ హౌస్ లో ఒక టాస్క్ కోసం ప్రియాంక.. తన జుట్టుని కట్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఆ విషయం గురించి ప్రియాంక సరదాగా మాట్లాడుతూ.. "షార్ట్ గా ఉన్న నా జుట్టు లాంగ్ గా పెరగగానే పెళ్లి చేసుకుంటా" అని బదులిచ్చారు. కాగా ప్రియాంక కన్నడ అమ్మాయి. సీరియల్స్ లో కంటే ముందు కొన్ని కన్నడ, తెలుగు, తమిళ చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే సినిమాల్లో పెద్దగా గుర్తింపు లభించలేదు. సినిమాల్లో ఆఫర్లు కూడా రాకపోవడంతో బుల్లితెర వైపు టర్న్ తీసుకుంది. ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది.
Next Story