Sat Dec 21 2024 00:10:46 GMT+0000 (Coordinated Universal Time)
Amardeep : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కి సవాల్ విసిరిన అమర్ దీప్..
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కి సవాల్ విసిరిన అమర్ దీప్. నన్ను ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను..
Amardeep : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 కంప్లేటేట్ అయ్యిపోయింది. ఇక ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిస్తే, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నంత కాలం వీరిద్దరి మధ్య గట్టి ఫైటే జరిగింది. ఆ ఫైట్ బయటకి వచ్చాక కూడా కొనసాగుతుంది. చివరి ఎపిసోడ్ పూర్తి అయిన తరువాత బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరిన అమర్ దీప్‌పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి రియాక్ట్ అవుతూ అమర్ దీప్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
అమర్ దీప్ ఏమన్నాడంటే..
"ఆ కారు దాడి గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆ విషయం గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టేశారు. అందుకు నేను చాలా బాధపడ్డా. నన్ను ఏమన్నా అనండి, నా పై చెత్త వీడియోలు చేయండి నేను బరిస్తాను. కానీ నా కుటుంబం ఏం చేసింది. మొన్న కారు అద్దాలు పగలు గొట్టారు. ఆ అద్దాలు ముక్కలు కారులో ఉన్న మా అమ్మ మీద పడ్డాయి. ఆమెకు ఏమి కాలేదు కాబట్టి ఓకే. కానీ ఒకవేళ ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి.
అలాగే మా ఇంటిలో ఆడవాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. మీ ఇంటిలో కూడా ఆడవాళ్లు ఉంటారు. వాళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా. నేను ఒక్కడినే ఉన్నప్పుడు ఏమైనా చేయండి. నన్ను తిట్టండి, దాడి చేయండి. నేను భయపడను. కానీ కుటుంబం ఉన్నప్పుడు కొంచెం మంచి ప్రవర్తించండి. నాతోనే కాదు ఇలా ఎవరితో ఎప్పుడు చేయవద్దు. ఇంకోసారి ఇలా ప్రవర్తించకండి. లేదు మీకు ఇంకా నా పై కోపం తగ్గలేదు అంటారా. నన్ను ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను" అంటూ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story