Fri Dec 20 2024 23:50:41 GMT+0000 (Coordinated Universal Time)
ఈవారం కూడా లేడీ కంటెస్టెంటే ఎలిమినేషన్..? ఈసారి ఆమెవంతు..!
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ మొదలయ్యి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కాగా ఈ వారం..
తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ మొదలయ్యి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. గత సీజన్స్ లో పోలిస్తే.. ఈ సీజన్ ఏం జరుగుతుందో అనేది ప్రేక్షకులు అసలు అంచనా వేయలేకపోతున్నారు. టాప్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు వీక్ అవుతున్నారు. వీక్ అనుకున్న వారు స్ట్రాంగ్ అవుతున్నారు. మొత్తానికి ఈ సీజన్ ఉల్టా పల్టా అంటూ మంచి కిక్ ఇస్తుంది. కాగా ఈ సీజన్ నాలుగు వారలు పూర్తి చేసుకోగా.. హౌస్ నుంచి నలుగురు లేడీ కంటెస్టెంట్స్ బయటకి వచ్చేశారు.
ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, థర్డ్ వీక్ సింగర్ దామిని, లాస్ట్ వీక్ రతిక.. ఇలా టాప్ సెలబ్రిటీస్ బయటకి వచ్చేశారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరిలో క్యూరియాసిటీ నెలకుంది. ఈ వారం నామినేషన్స్ లో ప్రశాంత్, సందీప్, శోభాశెట్టి తప్ప మిగిలిన ఏడుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు. ఇక ఈ ఏడుగురిలో శివాజీ, యావర్, గౌతమ్, టేస్టీ తేజ, శుభశ్రీ సేఫ్ కానున్నారని. చివరిలో ప్రియాంక, అమరదీప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఇద్దరిలో ప్రియాంకకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ వీక్ కూడా లేడీ కంటెస్టెంట్నే ఎలిమినేట్ చేస్తున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి నాగార్జున ఈ వీక్ ఎవరిని బయటకి తీసుకువస్తున్నాడో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ వీక్ బిగ్బాస్ సీజన్ 7.. సెకండ్ లాంచ్ జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అంబటి అర్జున్, భోలె షావళి, నయని పావని, పూజా మూర్తి, అంజలి పవన్.. తదితరులు పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే రాతిక కూడా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈవారం ఏం జరుగుతుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
Next Story