Mon Dec 23 2024 14:51:09 GMT+0000 (Coordinated Universal Time)
వైల్డ్ కార్డుతో బిగ్‌బాస్ హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్..
బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డుతో అయిదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు ఎవరు..?
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఐదో వారం కూడా పూర్తి చేసేసుకుంది. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్‌నే ఎలిమినేషన్ చేశారు. నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక హౌస్ నుంచి బయటకి వచ్చేయగా.. ఈ వారాం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ హిస్టరీలో ఇలా వరుస లేడీ కంటెస్టెంట్స్ అంతా బయటకి వచ్చేయడం ఇదే మొదటిసారి.
ఇక ఈ వారం వైల్డ్ కార్డుతో ఇంటిలోకి కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఆ కంటెస్టెంట్స్ ని నాగార్జున ఆడియన్స్ కి పరిచయం చేశాడు. వైల్డ్ కార్డుతో మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరు..? అంతకుముందు ఆడియన్స్ కి పరిచయం ఉన్నారా..? అనేది ఒక లుక్ వేసేయండి.
ఫస్ట్ వైల్డ్ ఎంట్రీగా 'అంబటి అర్జున్' ఎంట్రీ ఇచ్చాడు. పలు టీవీ సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అర్జున్.. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా రెండేళ్లపాటు పని చేశాడు. ఆ తరువాత మోడల్ గా ప్రయాణం మొదలుపెట్టి నటన పై టర్నింగ్ తీసుకోని కొన్ని సినిమాల్లో నటించిన రాని ఫేమ్ సీరియల్స్ తో వచ్చింది.
సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీతో 'అశ్విని శ్రీ' ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న అశ్విని శ్రీ.. తన తల్లిదండ్రులు మాట ప్రకారం ముందుగా చదువు పూర్తి చేసి యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. ఇప్పుడు బిగ్‌బాస్ తో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తుంది.
మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా 'భోలె షావళి' వచ్చాడు. 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్‌లో పడ్డ' అనే సాంగ్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న భోలె షావళి.. కెరీర్ ప్రారంభంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. అక్కడ సంగీతం పై పట్టు సాధించిన భోలె షావళి.. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫోక్ సాంగ్స్, బతుకమ్మ, బోనాల పండగల టైములో పాటలు చేస్తూ మంచి ఫేమ్‌నే సంపాదించుకున్నాడు. ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ ని ఆకర్షించడానికి బిగ్ బాస్ ని ఎంచుకున్నాడు.
గుండమ్మ కథ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన 'పూజా మూర్తి'.. నాలుగో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చింది. ఈమె ఈ సీజన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ షో ప్రారంభం అయ్యే కొన్ని రోజులు ముందు ఆమె తండ్రి మరణించారు. దీంతో ఆమె అప్పుడు ఎంట్రీ ఇవ్వలేకపోయింది.
చివరి వైల్డ్ కార్డు ఎంట్రీగా 'నయని పావని' పరిచయం అయ్యింది. టిక్‌టాక్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకున్న పావని.. షార్ట్ ఫిలిమ్స్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో పలు టీవీ షోలు, సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ ని అవకాశాలు అందుకోవాలని చూస్తుంది.
Next Story