Mon Dec 23 2024 06:31:16 GMT+0000 (Coordinated Universal Time)
Movie Re Release: రెండు నెలల్లో ఏడు తెలుగు సినిమాల రీరిలీజ్
తెలుగు సినిమాల రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది
తెలుగు సినిమాల రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అప్పట్లో పూరి జగన్నాధ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి రీ రిలీజ్ తో ఈ ట్రెండ్ ప్రారంభం అవ్వగా.. ఆ తర్వాత పలు సినిమాలను 4K ఫార్మాట్లో వెండితెర పైకి తీసుకుని వచ్చారు. పోకిరి, జల్సా, ఒక్కడు, ఖుషి, బిజినెస్ మ్యాన్, సింహాద్రి, ఆరెంజ్, జల్సా, సూర్య S/O కృష్ణన్ సినిమాలు థియేటర్లలో మరోసారి హిట్ గా నిలిచాయి. హీరోల పుట్టినరోజుకు అభిమానులు ఎంజాయ్ చేయడానికి.. ఆయా సినిమాల యానివర్సరీలను సెలెబ్రేట్ చేసుకోడానికి తెలుగు యువతకు ఈ రీరిలీజ్ లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అనేక మంది హీరోల పుట్టినరోజులు త్వరలో రాబోతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అరవై రోజుల్లో ఏకంగా ఏడు బ్లాక్ బస్టర్ సినిమాల రీ-రిలీజ్లు జరగనున్నాయి.
రాజమౌళి-రవితేజ విక్రమార్కుడు (జూలై 27),
నాని-సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు (ఆగస్టు 2)
మహేష్ బాబు నటించిన ఒక్కడు (ఆగస్టు 8)
కృష్ణవంశీ మురారి (ఆగస్టు 9)
చిరంజీవి 'ఇండస్ట్రీ హిట్' ఇంద్ర (ఆగస్టు 22)
ఆర్జీవీ-నాగార్జునల శివ (ఆగస్ట్ 29),
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ (2 సెప్టెంబర్) రాబోయే రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి.
Next Story