Tue Nov 05 2024 16:38:53 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనివాసమూర్తి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు
ముఖ్యంగా.. సూర్య, విక్రమ్ లకు ఆయన డబ్బింగ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయింది. శ్రీనివాసమూర్తి వంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ను..
గతేడాది డిసెంబర్ నుండి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజు అలనాటి అందాల నటి జమున(86) కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. 1949 మే 15న మైసూర్ రాష్ట్రంలోని కోలార్ లో జన్మించారు. ప్రముఖ హీరోలకు డబ్బింగ్ చెబుతూ.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో సేవలందిస్తున్నారు.
శ్రీనివాసమూర్తి తెలుగులో.. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా.. సూర్య, విక్రమ్ లకు ఆయన డబ్బింగ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయింది. శ్రీనివాసమూర్తి వంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ను కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ను ఇండస్ట్రీ కోల్పోవడం దురదృష్టకరమని ప్రముఖుల అభిప్రాయపడ్డారు. విక్రమ్ అపరిచితుడు, సూర్య సింగం సిరీస్, 24 సినిమాలకు, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అలవైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్ కు ఇలా ఎన్నో గొప్ప చిత్రాలకు స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పారు శ్రీనివాసమూర్తి.
Next Story