Mon Dec 23 2024 01:09:52 GMT+0000 (Coordinated Universal Time)
దిల్ రాజుకి షాక్.. పండుగ సమయాల్లో థియేటర్లలోకి పరభాషా చిత్రాలకు నో ఎంట్రీ
తమిళ సినిమాగా తెరకెక్కుతున్నా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు తెలుగు వాళ్ళు. ఈ సంక్రాంతికి దిల్ రాజు
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు మనదగ్గర సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. స్టార్ హీరోల పెద్ద సినిమాలతో పాటు.. చిన్న చిన్న సినిమాలు కూడా పండుగల సమయాల్లోనే విడుదల చేసి హిట్ కొట్టాలనుకుంటారు. దసరా, సంక్రాంతి సమయాల్లో తెలుగు సినిమాలతో పాటు.. డబ్బింగ్ సినిమాలు కూడా బరిలోకి దిగి పోటీనిస్తాయి. ముఖ్యంగా తమిళ సినిమాలు. దానివల్ల తెలుగు సినిమాలకు కలెక్షన్లు తగ్గి.. నిర్మాతలు నష్టపోతున్నారు.
2023 సంక్రాంతి బరిలోకి చిరంజీవి, బాలకృష్ణ దిగుతున్నారు. వారిద్దరి సినిమాలతో పాటు..మరికొన్ని తెలుగు సినిమాలు, తమిళ స్టార్ హీరోలైన విజయ్, అజిత్ సినిమాలు కూడా తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాతలు. అజిత్ తెలుగు మార్కెట్ ని పెద్దగా పట్టించుకోరు, కాబట్టి సినిమా రిలీజ్ అవ్వకపోయినా లెక్క చేయరు. కానీ విజయ్ కి తెలుగులో మార్కెట్ ఉండటంతో ఆయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సారి విజయ్ వరిసు సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రాబోతుంది.
తమిళ సినిమాగా తెరకెక్కుతున్నా ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు తెలుగు వాళ్ళు. ఈ సంక్రాంతికి దిల్ రాజు వరిసు సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇటీవల షూటింగ్స్ ఆపినప్పుడు వరిసు సినిమా షూటింగ్ ఎందుకు ఆపలేదు అని అడిగితే అది తమిళ సినిమా అని సమాధానం ఇచ్చాడు దిల్ రాజు. తాజాగా.. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి దిల్ రాజుకి షాకిచ్చింది. 08-12-2017 తేదీన జరిగిన అత్యవసర మీటింగులో.. "సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది"
ఆ తర్వాత 2019లో దిల్ రాజు కూడా.. తెలుగు స్ట్రెయిట్ సినిమాలుండగా.. డబ్బింగ్ సినిమాల విడుదలకు థియేటర్స్ ఇవ్వబోమని ఘాటుగానే చెప్పారు. ఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో ఈ సారి సంక్రాంతి బరిలో దిగాలని ట్రై చేస్తున్న దిల్ రాజుకి తాను చెప్పిన మాటలనే చెప్పి షాక్ ఇచ్చారు తెలుగు ప్రొడ్యూసర్ ఫిలిం కౌన్సిల్. మరి ఈ పండగకి వరిసు సినిమాకి థియేటర్స్ దొరుకుతాయా లేదా సినిమాని వాయిదా వేస్తారా చూడాలి.
Next Story