Fri Dec 20 2024 04:55:25 GMT+0000 (Coordinated Universal Time)
Avantika : తెలుగు సినిమాలో పద్ధతిగా.. హాలీవుడ్లో బోల్డ్‌గా..
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు.. ఇప్పుడు హాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
Avantika Vandanapu : తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు.. ఇప్పుడు హాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అక్కడ హాట్ హాట్ అందాలతో బోల్డ్ గా దర్శనమిస్తుంది. తెలుగు అమ్మాయి అయిన అవంతిక.. బ్రహ్మోత్సవం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ ఆ తరువాత హాలీవుడ్ కి చెక్కేసిన ఈ భామ.. అక్కడ అందాలు ఆరబోస్తూ బోల్డ్ షో చేస్తుంది.
2020 నుంచి హాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక.. సినిమాలు, వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలు చేస్తూ ముందుకు సాగింది. ఇక ఆ తరువాత 2021లో మెయిన్ లీడ్ ఛాన్స్ అందుకొని 'స్పిన్' అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కంటే.. 2023లో రిలీజ్ అయిన 'మీన్ గర్ల్స్' మూవీ అవంతికకు సూపర్ స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది. ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసింది. ఆ మూవీలో అవంతిక యాక్టింగ్ అండ్ బోల్డ్ షోకి హాలీవుడ్ టు టాలీవుడ్ తన పేరు మారుమోగిపోయింది.
ఇక ఆ మూవీలో అవంతికని చూసిన తెలుగు ఆడియన్స్.. అసలు తెలుగు సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న అమ్మాయి ఒకటేనా అని షాక్ అవుతున్నారు. బ్రహ్మోత్సవం సినిమా టైంలో మహేష్ బాబుని అచ్చ తెలుగులో ఇంటర్వ్యూ చేసి అందర్నీ ఆకట్టుకున్న అవంతిక.. ఇప్పుడు హాలీవుడ్ లో అమెరికన్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడుతూ అదరగొడుతుంది.
ప్రస్తుతం హాలీవుడ్ లో అవంతికకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 'హారర్ స్కోప్' సినిమాలో ఓ ముఖ్య పాత్రని చేస్తున్న అవంతిక.. 'ఏ క్రోన్ ఆఫ్ విషెస్' సినిమాలో మెయిన్ లీడ్ చేస్తూనే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. మరి హాలీవుడ్ లో ఈ భామ ఎంతటి స్టార్డమ్ అందుకుంటారో చూడాలి.
Next Story