Fri Dec 20 2024 12:21:53 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది నింగికెగసిన ప్రముఖ సినీ తారలు వీరే..
సినీ పరిశ్రమ ఈ ఏడాది ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని బాధలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అలనాటి సినీ తారలు కన్నుమూశారు.
2023 Rewind : సినీ పరిశ్రమ ఈ ఏడాది ఎన్నో ఆనందాలతో పాటు కొన్ని బాధలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అలనాటి సినీ తారలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ఏడాది ప్రేక్షకులు కోల్పోయిన ఆ సినీ తారలు ఎవరు అనేదాని పై ఒక లుక్ వేసేయండి.
జమున..
వెండితెర సత్యభామగా పిలుచుకునే అలనాటి నటి జమున.. 86 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొన్నాళ్ల నుంచి వయోభారంతో బాధపడుతున్న జమున జనవరి 27న మరణించారు.
కె విశ్వనాథ్..
తెలుగు సినీ పరిశ్రమని 19's లోనే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లిన దర్శకుడు కె విశ్వనాథ్. భారతీయ కళలను ప్రతిబింబిస్తూ సినిమాలను తెరకెక్కించి కళాతపస్వి అనే బిరుదుని అందుకున్న విశ్వనాథ్.. ఫిబ్రవరి 3న వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
వాణీ జయరామ్..
దాదాపు 19 భాషల్లో 20 వేలకు పైగా పాటల్ని పాడిన వాణి జయరామ్.. ఈ ఏడాది కన్నుమూశారు. ఫిబ్రవరి 4న 77 ఏళ్ళ వయసులో అనారోగ్య కారణాలతో మరణించారు.
నందమూరి తారకరత్న..
రాజకీయ రంగంలో బిజీ అవుతున్న నందమూరి తారకరత్న.. పొలిటికల్ కాంపెయిన్ లోనే అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు చావుతో పోరాడి 39 ఏళ్ళ వయసులోనే ఫిబ్రవరి 18న మరణించారు.
శరత్ బాబు..
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న శరత్‌బాబు.. మే 22న 71 ఏళ్ళ వయసులో మరణించారు. శరత్ బాబు హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు.
చంద్రమోహన్..
హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. నవంబర్ 11న 78 ఏళ్ళ వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు.
రాజ్..
రాజ్-కోటి సంగీత ద్వయంలలో ఒకరైన రాజ్ మే 21న.. 68 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు.
శ్రీనివాస మూర్తి..
సూర్య, విక్రమ్, అజిత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి.. హార్ట్ ఎటాక్‌తో జనవరి 27న కన్నుమూసారు.
సాగర్..
ఒకప్పటి అగ్ర దర్శకుడు సాగర్.. ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యల వల్ల 73 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
సుధీర్ వర్మ..
కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్ వంటి చిత్రాల్లో నటించిన సుధీర్ వర్మ.. ఆర్ధిక సమస్యల కారణంతో జనవరి 24న బలవన్మరణానికి పాల్పడి 34 ఏళ్ళ వయసులో మరణించారు.
మనోబాల..
ప్రముఖ తమిళ హాస్య నటుడు మనోబాల.. లివర్ సంబంధిత సమస్యలతో 69 ఏళ్ళ వయసులో మే 3న కన్నుమూశారు.
మయిల్ సామి..
కోలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు మయిల్ సామి.. 57 వయసులో అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 19న మృతి చెందారు.
ఆకాంక్ష దుబే..
భోజ్ పురి యాక్ట్రెస్ ఆకాంక్ష దుబే.. 23 ఏళ్ళ చిన్న వయసులోనే అనుమానస్థితిలో మార్చి 26న మరణించారు. ఇది హత్యా? ఆత్మహత్య? అనేది క్లారిటీ లేదు.
ఆదిత్య సింగ్ రాజ్‌పుత్..
ప్రముఖ బాలీవుడ్ సీరియల్ యాక్టర్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్.. 32 ఏళ్ళ వయసులో మే 22న మరణించారు.
Next Story