Fri Dec 20 2024 14:02:34 GMT+0000 (Coordinated Universal Time)
దసరా బాక్సాఫీస్ రిలీజ్స్.. థియేటర్, ఓటీటీలోకి రానున్న చిత్రాలివే..
మరి ఈ వారం తెలుగులో రిలీజ్ కాబోతున్న సినిమాలు వైపు ఒక లుక్ వేసేయండి.
ఈ దసరా పండగా ప్రేక్షకులకు ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వనుంది. స్టార్ హీరోల నుంచి మోస్ట్ హైపెడ్ అండ్ అవైటెడ్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల నుంచి సినిమాలు వస్తుంటే.. డబ్బింగ్ ద్వారా మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం తెలుగులో రిలీజ్ కాబోతున్న సినిమాలు వైపు ఒక లుక్ వేసేయండి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ మూవీ అక్టోబరు 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న లోకేష్ కనగరాజ్, విజయ్ ‘లియో’.. అక్టోబరు 19న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. దీంతో తెలుగులో ఈ సినిమాకి ఓ రేంజ్ బజ్ నెలకుంది. మరి చరణ్ ఉంటాడో లేదో చూడాలి.
రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. నిజ జీవిత కథలు ఆధారంగా బయోగ్రాఫికల్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా.. అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తుంది.
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘గణపథ్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘ఎ హీరో ఈజ్ బోర్న్’ అనే ట్యాగ్ లైన్‌తో ఆడియన్స్ ముందుకు వస్తుంది. అక్టోబరు 20న హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది.
టాలీవుడ్ దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న మరో హారర్ థ్రిల్లర్ మూవీ ‘మాన్షన్ 24’. వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, బిందు మాధవి, అవికా గోర్, రావు రమేష్, నందు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతుంది. హాట్‌స్టార్ లో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమ్ కానుంది.
ఇక ఓటీటీ రిలీజ్స్ విషయానికి వస్తే..
Aha Videoలో
అన్‌స్టాపబుల్ విత్ NBK S3 E1 - అక్టోబరు 19
మామా మశ్చీంద్ర - అక్టోబరు ౨౦
కృష్ణారామా - అక్టోబర్ 22 (ETV Win)
Next Story