Mon Dec 23 2024 18:26:45 GMT+0000 (Coordinated Universal Time)
Telugu Movies : రిపబ్లిక్ డేకి రిలీజయ్యే సినిమాలివే..
ఈ రిపబ్లిక్ డేకి కూడా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
Telugu Movies : ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేశాయి. అక్కడితో సినిమా కార్నివాల్ అయ్యిపోయిందని అనుకున్నారు అందరూ. కానీ మూవీ ఫెస్టివల్ ఇంకా ఉంది. ఈ రిపబ్లిక్ డేకి కూడా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
ధనుష్ హీరోగా తెరకెక్కిన 'కెప్టెన్ మిల్లర్' ఈ సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో జనవరి 25న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. మరి తెలుగులో ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
మరో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన 'అయలాన్' సినిమా కూడా సంక్రాంతికి కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎలియాన్ కథాంశంతో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా తెలుగులో జనవరి 25న రిలీజ్ కాబోతుంది.
బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాల తరువాత హృతిక్ రోషన్, సిద్దార్థ్ ఆనంద కలయికలో వస్తున్న సినిమా 'ఫైటర్'. ఈ సినిమాలో దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా 25నే విడుదల కాబోతుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారా లేదా అనేదాని పై క్లారిటీ లేదు.
ఇక హీరోయిన్ హన్సిక నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ '105 మినిట్స్' 26న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాని సింగల్ క్యారెక్టర్ తో సింగల్ షాట్ లో పూర్తి చేశారట.
Next Story