Mon Dec 23 2024 11:23:14 GMT+0000 (Coordinated Universal Time)
Movie Updates : శివరాత్రి స్పెషల్ మూవీ అప్డేట్స్ ఇవే..
నేడు శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ నుంచి అదిరిపోయే మూవీ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ వైపు ఓ లుక్ వేసేయండి.
Movie Updates : నేడు శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ నుంచి అదిరిపోయే మూవీ అప్డేట్స్ వచ్చాయి. బాలయ్య, ప్రభాస్, మంచు విష్ణు, ధనుష్ తమ కొత్త సినిమా అప్డేట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి దిల్ ఖుష్ చేసారు. మరి ఫ్యాన్స్ ని ఖుషి చేసిన ఆ అప్డేట్స్ వైపు ఓ లుక్ వేసేయండి.
ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడి' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ తో సినిమాలో ప్రభాస్ పాత్ర పేరుని కూడా తెలియజేసారు. ఈ మూవీలో ప్రభాస్ 'భైరవ' అనే పాత్రలో కనిపించబోతున్నారట. ఈ కొత్త పోస్టర్ ప్రస్తుతం భైరవ హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న NBK109 నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. "నక్కల మీదకు సింహం వేటకి వస్తే అది వార్ అవ్వదు, హంటింగ్ అవుతుంది" అంటూ యాక్షన్ సన్నివేశంతో బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ విజుల్స్ వేయిస్తుంది. ఈ గ్లింప్స్ తో మూవీ పై హైప్ ని అమాంతం పెంచేశారు.
మంచు విష్ణు నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ 'కన్నప్ప' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. బాణం, విల్లుతో మంచు విష్ణు వారియర్ లుక్ లో ఉన్న పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని పెట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక చివరిగా మిల్కీ బ్యూటీ తమన్నా.. లేడీ అఘోర లుక్ లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేసారు. ఓదెల 2 మూవీలో నటిస్తున్న తమన్నా.. ఆ సినిమాలో శివశక్తిగా కనిపించబోతున్నారు. తమన్నా ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని థ్రిల్ చేసి బాగా ఆకట్టుకుంది.
Next Story