Sun Jan 12 2025 15:35:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు 1 నుంచి షూటింగ్ల బంద్
తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లన నిలిపేయాలని నిర్ణయించింది
తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లన నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో అగ్రహీరోల సినిమాల షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. రేపు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం జరగుతుంది. ఈ ప్రత్యేక సమావేశం జరగక ముందే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి నిర్ణయంతో అగ్ర ినిర్మాతలు అసంతృప్తికి గురయ్యారు.
అగ్రహీరోల సినిమాలు...
ప్రస్తుతం ముప్పయి సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఇందులో పది పదిహేను సినిమాలు చిన్నవి కాగా, దాదాపు పదిహేను అగ్ర హీరోలు సినిమాలు నిలిచిపోనున్నాయి. ఫిలింఛాంబర్ ప్రమేయం లేకుండానే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారనుంది. ఓటీటీ లో సినిమాల విడుదల, థియేటర్లకు ప్రేక్షకుల జనం ఆదరణ లభించకపోవడం, ఖర్చులు భారీగా పెరిగి పోవడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని సినిమా షూటింగ్ లను బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే షూటింగ్ లను ప్రారంభించాలని నిర్మాత మండలి నిర్ణయించింది.
Next Story