Fri Dec 20 2024 14:16:18 GMT+0000 (Coordinated Universal Time)
Pavala Syamala : నేను బ్రతికుంటానో లేదో తెలియదు.. పావలా శ్యామల ఆవేదన..
నేను బ్రతికుంటానో లేదో తెలియదంటూ సీనియర్ నటి పావలా శ్యామల ఆవేదన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Pavala Syamala : సినిమా యాక్టర్స్ జీవితాలు తెర పై కనిపించేంత రంగులు రంగులుగా ఉండదు. అవకాశాలు ఉన్నంత వరకు ప్రతి కళాకారుడి జీవితం రంగుల ప్రపంచంతో బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి అవకాశాలు తగ్గితే.. ఆ రంగుల ప్రపంచం కాస్త చీకటి అయ్యిపోతుంది. తినడానికి కూడా తిండి లేని దీనస్థితిని చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే టాలీవుడ్ సీనియర్ నటి 'పావలా శ్యామల' ఎదుర్కొంటున్నారు.
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా సూపర్ హిట్టు సినిమాల్లో నటించిన ఈ నటి.. ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో సినిమాలకు దూరమయ్యారు. ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో తిండి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చి పడింది. ఒక పక్క తన అనారోగ్యం, మరో పక్క తన కూతురు కూడా అనారోగ్యంతో బాధ పడుతుండడంతో.. పావలా శ్యామల జీవితాన్ని దిక్కులేని స్థితిలో అనాధాశ్రమానికి తీసుకు వెళ్ళింది.
ఆమె పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఏదో రకంగా సహాయం అందిస్తూనే వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నడవలేని స్థితికి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పావలా శ్యామల.. రీసెంట్ గా ఓ తెలుగు టీవీ షోకి వచ్చారు. ఆ వేదిక పై ఆమె మాట్లాడిన మాటలు అందర్నీ కన్నీరు పెట్టించాయి.
దాదాపు అందరి హీరోలతో అన్ని హిట్టు సినిమాల్లో నటించిన తన బ్రతుకు చివరికి ఇలా అవుతుందని, ఇంతటి దుస్థితికి చేరుకుంటుందని అసలు ఊహించలేదని బాధ పడ్డారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది, తన కష్టాలు చెప్పి బాధ పెట్టడానికి కాదని, తాను ఎప్పటి వరకు బ్రతికుంటానో తెలియదని, చివరిగా ఒకసారి ప్రేక్షకులకు కనిపించి, వారి అభిమానం పొందడం కోసమే వచ్చినట్లు పేర్కొన్నారు. పావలా శ్యామల చేసిన ఈ కామెంట్స్ ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
Next Story