Mon Dec 23 2024 12:12:50 GMT+0000 (Coordinated Universal Time)
Movie Releases : ఈవారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్స్ ఇవే..
ఈవారం థియేటర్ అండ్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే..
గత వారం తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం చిన్న సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
థియేటర్ రిలీజ్స్..
సుహాస్ హీరోగా నటిస్తున్న 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' మూవీ.. రీజినల్ కథతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో సుహాస్ తనలోని మాస్ ని కూడా చూపించబోతున్నారు. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతుంది.
బిగ్బాస్ ఫేమ్ సోహెల్.. 'బూటుకాట్ బాలరాజు' అనే రొమాంటిక్ ఎంటర్టైన్టైనింగ్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా ఒక మంచి హిట్టుని అందుకోవాలని చూస్తున్నారు సోహెల్.
శ్రీనివాస్ అవసరాల, అభినవ్ గోమఠం, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కిస్మత్' క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ కూడా ఫిబ్రవరి 2నే రిలీజ్ కాబోతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన 'గేమ్ ఆన్' మూవీ.. ఈ శుక్రవారం ఫిబ్రవరి 2న థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి సిద్దమవుతుంది.
రొమాంటిక్ కామెడీ డ్రామాతో వస్తున్న 'హ్యాపీ ఎండింగ్'.. ఫిబ్రవరి 2న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న 'ధీర' కూడా ఈ శుక్రవారమే థియేటర్ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.
ఓటీటీ రిలీజ్స్..
విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా ‘సైంధవ్’ ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది.
థియేటర్ లో భయపెట్టిన హారర్ థ్రిల్లర్ మూవీ 'పిండం'.. ఫిబ్రవరి 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.
Next Story