Fri Dec 20 2024 12:40:18 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది బాగా వినిపించిన తెలుగు సాంగ్స్ ఇవే..
2023లో తెలుగులో బాగా వినిపించిన సాంగ్స్ ఏంటో ఓ లుక్ వేసేయండి.
2023 Rewind : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలతో పాటు సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మరి 2023లో తెలుగులో బాగా వినిపించిన సాంగ్స్ ఏంటో ఓ లుక్ వేసేయండి.
జనవరి నెలలో మాట్లాడుకుంటే.. వీరసింహారెడ్డి సినిమాలోని 'జై బాలయ్య మాస్ యాంతం' మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
ఇక ఇదే నెలలో వచ్చిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీలోని 'బాస్ పార్టీ' సాంగ్.. ఈవెంట్స్ లో ఫేవరెట్ ప్లే లిస్ట్ అయ్యిపోయింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.
ఫిబ్రవరిలో కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమాలో బాలయ్య సూపర్ హిట్ 'ఎన్నో రాత్రులు వస్తాయిగాని' సాంగ్ రీమేక్ చేయగా.. అది బాగా వైరల్ అయ్యింది.
అదే నెలలో వచ్చిన ధనుష్ 'సార్' సినిమాలోని 'మాస్టరు మాస్టరు' పాట అమ్మాయిలకు ఫేవరెట్ సాంగ్ అయ్యిపోయింది. జివి ప్రకాష్ ఈ మూవీకి సంగీతం చేశారు.
మార్చిలో జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన 'బలగం' మూవీలోని 'ఊరు పల్లెటూరు', 'పొట్టి పిల్ల' సాంగ్స్ బాగా వినిపించాయి. భీమ్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేశారు.
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ'లోని 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా' సాంగ్ యూత్ కి యాంతం అయ్యిపోయింది. లియో జేమ్స్ మ్యూజిక్ చేశారు.
నాని 'దసరా' సినిమాలోని 'చమ్కీల అంగేసి', 'పెళ్లి బారాత్' బిట్ బాగా ట్రెండ్ అయ్యాయి. సంతోష్ నారాయణ సంగీతం అందించారు.
సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీలోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ అబ్బాయిలకు ఫేవరెట్ సాంగ్ అయ్యింది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు.
ప్రభాస్ 'ఆదిపురుష్'లోని 'జై శ్రీ రామ్' సాంగ్ డివోషనల్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. అజయ్-అతుల్, సచేత–పరంపర మ్యూజిక్ చేశారు.
యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన 'బేబీ'లోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' సాంగ్ యూత్ మనసుని దోచుకుంది. విజయ్ బుల్గేనిన్ సంగీతం చేశారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ 'బ్రో' సినిమాలోని 'థీమ్ అఫ్ బ్రో' బాగా ట్రెండ్ అయ్యింది. థమన్ సంగీతం చేశారు.
విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషి'లోని 'నా రోజా నువ్వే' సాంగ్ అబ్బాయిల ఫేవరెట్ లిస్ట్ లో స్తానం దక్కించుకుంది. హేశం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ చేశారు.
యూత్ ఫుల్ కాలేజీ ఎంటర్టైనర్ 'మ్యాడ్'లోని 'కాలేజీ పాప' సాంగ్ బాగా ట్రెండ్ అయ్యింది. భీమ్స్ మ్యూజిక్ చేశారు.
నాని 'హాయ్ నాన్న'లోని 'సమయమా' సాంగ్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంది. హేశం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ చేశారు.
ఇక ఈ ఏడాది రిలీజ్ కాకుండా, సాంగ్స్ మాత్రం రిలీజ్ అయ్యిన గుంటూరు కారం 'ధమ్ బిర్యానీ', టిల్లు స్క్వేర్ ' టిక్కెటే కొనకుండా', గ్యాంగ్స్ అఫ్ గోదావరి 'సుట్టమాలా సూసి' సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
Next Story