Mon Dec 23 2024 12:42:36 GMT+0000 (Coordinated Universal Time)
Shanmukh Jaswanth : సూసైడ్ ఆలోచనతో షణ్ముఖ్.. డిప్రెషన్ వలనే గంజాయి..!
డిప్రెషన్ లో సూసైడ్ ఆలోచనతో షణ్ముఖ్.. గంజాయి సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Shanmukh Jaswanth : తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని, ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపుని అందుకున్నారు. కానీ ఆ ఫేమ్ ని, గుర్తింపుని.. పోలీస్ కేసులతో పోగొట్టుకుంటున్నారు. ఆ మధ్య ఎప్పుడో రాష్ కారు డ్రైవింగ్ తో పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. ఇప్పుడు ఇటీవల గంజాయి కేసులో స్టేషన్ కి వెళ్ళాడు.
షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఒక అమ్మాయిని మోసం చేయడంతో పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. దీంతో పోలీసులు సంపత్ కోసం అతని ఫ్లాట్ కి వెళ్లగా.. అక్కడ షణ్ముఖ్, గంజాయి దొరికాయి. ఇక అవి చూసిన పోలీసులు అన్నదమ్ములు ఇద్దర్ని అరెస్ట్ చేసారు. ఇక్కడి వరకు అందరికి తెలిసిందే. తాజాగా ఈ కేసు ప్రోగ్రెస్ గురించి పోలీసులు మీడియాకి తెలియజేసారు. విచారణలో ఒక్కో విషయం బయటికి వస్తుందని పేర్కొన్నారు.
యువతి ఇచ్చిన పిర్యాదుతో సంపత్ ఫ్లాట్ కి వెళ్లిన సమయంలో పోలీసులతో షణ్ముఖ్ మాట్లాడుతూ.. తాను డిప్రెషన్ లో ఉన్నట్లు. ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొన్నాడట. ఇక ఈ డిప్రెషన్ కారణంతోనే అతడు గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేసారు.
ఇక కేసు నమోదు తరువాత సంపత్ పై మరో కేసు కూడా నమోదు అయ్యిందట. సంపత్ తనతో పాటు ఎంబీఏ చదివిన ఓ అమ్మాయి దగ్గర బిజినెస్ పేరుతో రూ.20 లక్షల తీసుకోని మోసం చేసాడట. వాటి గురించి అడిగితే ఆమెను బెదిరింపులకు గురి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొందట.
Next Story