క్లైమాక్స్ లో హీరోని చంపేస్తారా..?
మే 10న తమిళనాట విడుదల కావాల్సిన విశాల్ నటించిన అయోగ్య సినిమా కాస్త లెట్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరి [more]
మే 10న తమిళనాట విడుదల కావాల్సిన విశాల్ నటించిన అయోగ్య సినిమా కాస్త లెట్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరి [more]
మే 10న తమిళనాట విడుదల కావాల్సిన విశాల్ నటించిన అయోగ్య సినిమా కాస్త లెట్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరి – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ రీమేక్. ఎప్పుడూ తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసే విశాల్ ఈసారి అయోగ్యని తెలుగులో డబ్ చెయ్యలేదు. ఎందుకంటే టెంపర్ సినిమా తెలుగు ప్రేక్షకులు చూసెయ్యడంతో మళ్లీ రీమేక్ చేసినా ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కారని విశాల్ ముందే ఊహించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కోలీవుడ్ లో విడుదలైన అయోగ్యకి పాజిటివ్ టాక్ పడింది. తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ చూడకుండా ఉంటే గనుక అయోగ్య సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ నటనను పక్కనబెడితే.. విశాల్ కూడా బాగా నటించాడట. ఎన్టీఆర్ తో పోలిస్తే విశాల్ నటన తేలిపోతుంది కానీ.. విడిగా చూస్తే విశాల్ కూడా బాగానే నటించాడని చెబుతున్నారు.
రియాల్టీకి దగ్గరగా క్లైమాక్స్
ఇకపోతే పూరి తెలుగులో తనదైన స్టయిల్లో హీరోని ఫస్ట్ హాఫ్ లో నెగెటివ్ గా సెకండ్ హాఫ్ లో హీరోగా చూపించాడు. ఇక క్లైమాక్స్ లో ఎన్టీఆర్ విలన్స్ చేసిన పనికి ఆధారం లేకపోవడంతో తప్పును తన మీద వేసుకుని ఉరికి సిద్ధపడడం, తర్వాత ఎన్టీఆర్ మంచోడే అని కోర్టు తీర్పు చెప్పడంతో ఆ విలన్స్ ని ఎన్టీఆర్ చంపెయ్యడంతో సినిమాని ముగించాడు పూరి. కానీ తమిళనాట అయోగ్య క్లైమాక్స్ ని దర్శకుడు కాస్త డిఫ్రెంట్ గా ముగించాడు. క్లైమాక్స్ లో హీరో విలన్స్ ని చంపేసి తానూ చనిపోయే క్లైమాక్స్ ని రాసుకున్నాడట. ఆ డ్రమాటిక్ క్లైమాక్స్ కి కోలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని దర్శకుడు అలా ప్లాన్ చేసాడట. మరి మన తెలుగు ప్రేక్షకులు మాత్రం హీరో క్యారెక్టర్ ని చంపితే అస్సలు జీర్ణించుకోలేరు. కానీ తమిళ ప్రేక్షకులు రియాలిటీకి దగ్గరగా కనెక్ట్ అవతారు అందుకే దర్శకుడి ప్లాన్ అక్కడ వర్కౌట్ అయ్యింది.