Sun Dec 22 2024 21:47:05 GMT+0000 (Coordinated Universal Time)
గెలిచిన దిల్ రాజు.. సంచలన ఆరోపణలు చేసిన కళ్యాణ్
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పోలింగ్ లో దిల్ రాజు తన ప్రత్యర్థి, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పై విజయం సాధించారు. దిల్ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. టీఎఫ్సీసీలో కీలక పోస్టులను దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. మొత్తం ఓట్లు 48... మ్యాజిక్ ఫిగర్ 25 కాగా, దిల్ రాజు కు 31 ఓట్లు లభించాయి.
ఓటమి అనంతరం సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్లుగా ఎన్నికలు జరిగాయని.. అయితే ఎన్నికలు జరిగిన మూడు సెక్టార్లకు సంబంధించి ఓటర్లంతా కూడా కరెక్ట్ గా ఓట్లు వేశారని.. కానీ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోయారని అన్నారు కళ్యాణ్.
Next Story