Mon Dec 23 2024 18:10:10 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ కి పండగే.. థార్ మార్ థక్కర్ మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్
ఇక ఇటీవలే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా గాడ్ ఫాదర్ నుంచి "థార్ మార్ థక్కర్ మార్"
మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. మళయాళ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ పోషిస్తుండగా.. నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మెగాఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఇటీవలే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా గాడ్ ఫాదర్ నుంచి "థార్ మార్ థక్కర్ మార్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. "బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచండ్రే" అంటూ మొదలయ్యే ఈ పాటలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ స్టెప్పులేయడం విశేషం. తమన్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులు, శ్రోతలను ఆకట్టుకుంటోంది. కాగా.. కొద్దిరోజుల క్రితమే ఈ సాంగ్ ఆడియోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రేయ ఘోషాల్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. ప్రభుదేవా ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
Next Story