తనపై రూమర్లకు తమన్ జవాబు
తన చిన్న తనం నుండే మ్యూజిక్ మీద పట్టు ఉన్న తమన్ చాలా త్వరగా సినిమాలకి సంగీతం అందించడం స్టార్ట్ చేసాడు. దాదాపు 70 సినిమాల వరకు మ్యూజిక్ అందించాడు. ప్రసుతం టాలీవుడ్ లో కీలక మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న తమన్ తాజాగా ఓ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
గట్టి సమాధానం..
మీరు చాలా హిట్ సినిమాలకి సంగీతం అందించారు కానీ మీపై ఎప్పటినుండో ఒక రూమర్ ఉంది మీరు ‘కాపీ క్యాట్’ అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తమన్... తాను కాపీ చేస్తే బాధపడాలని, చెయ్యనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. దర్శకనిర్మాతలకు నచ్చింది, వారు కోరింది ఇవ్వడం నా బాధ్యత, ఒకవేళ నేను కాపీ కొట్టినా వారికి తెలియనంత వెర్రి దర్శకనిర్మాతలు మనవారు కాదు అని కొంచం గెట్టిగానే సమాధానం ఇచ్చాడు.
కాపీ కొట్టడం అంత ఈజీ కాదు...
ఒక ట్యూన్ ఓకే కావాలంటే దాని వెనుక చాలామంది ఉంటారు. దర్శకనిర్మాతలు, హీరోలు, వాళ్ల ఫామిలీస్ ఇలా చాలా మందిని ఒప్పించాలి. వాళ్లు ఓకే అన్నాకే ఆ సాంగ్ రికార్డింగ్ కి వెళ్తుంది. అయినా ఇప్పుడున్న టెక్నాలజీలో మనం కాపీ కొట్టడం అంత ఈజీ కాదు అని వెల్లడించారు. ఇటువంటి సిల్లీ రూమర్స్ ని పట్టించుకోడం ఎప్పుడో మానేశా అని అన్నాడు.