Mon Dec 23 2024 12:41:51 GMT+0000 (Coordinated Universal Time)
బోయపాటికి కౌంటర్ ఇచ్చిన థమన్.. అసలు ఏమైంది..?
అఖండ సక్సెస్ లో థమన్ క్రెడిట్ లేదన్న బోయపాటి. కౌంటర్ ట్వీట్ వేసిన థమన్.
టాలీవుడ్ సంగీత దర్శకుడు థమన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిపోయాడు. స్టార్ హీరోల సినిమాలు అందరికి థమనే కావాలి అంటున్నారు. ఆడియన్స్ కూడా తమ అభిమాన హీరోకి థమనే చేయాలంటూ మేకర్స్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నాడు. ఇక ఇటీవల రామ్ 'స్కంద' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
గతంలో బోయపాటి, థమన్ కలయికలో వచ్చిన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మూవీ చూసిన ప్రతి ఒక్కరు థమన్ సంగీతం గురించే మాట్లాడారు. దీంతో స్కంద విషయంలో ప్రేక్షకులు భారీ హైప్ పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి పెద్దగా మార్కులు పడలేదు. ఈ విషయానే ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీనుని ప్రశ్నించారు. "మీ అఖండ సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం అయ్యింది. కానీ స్కంద విషయంలో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. దాని గురించి మీరు ఏం చెబుతారు" అంటూ ప్రశ్నించారు.
దీనికి బోయపాటి బదులిస్తూ.. "బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా నేను అన్ని చూసుకున్న తరువాతే ఒకే చేస్తాను. కానీ స్కందలో ఎందుకు అలా అయ్యిందో ఒకసారి రివ్యూ చేసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు. ఇక అఖండ గురించి మాట్లాడుతూ.. "ఆ మూవీని మ్యూజిక్ లేకుండా చూసినా ఆడియన్స్ కి అదే హై ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే ఆ స్టోరీలో అంత దమ్ము ఉంది" అని చెబుతూ అఖండ సక్సెస్ లో థమన్ పాత్ర ఏం లేదనట్లు మాట్లాడాడు.
ఇక ఈ విషయంపై నెటిజెన్స్ బోయపాటిని విమర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా థమన్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. 'ఐ డోంట్ కేర్' అంటూ ట్వీట్ వేశాడు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. థమన్ బోయపాటికి కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
Next Story