సూర్య అందుకే అలా చేశాడా?
సూర్య అంటే ఇప్పుడు తమిళ థియేటర్స్ అసోసియేషన్ మండలి వారు బాగా మండిపడుతున్నారు. ఎందుకంటే సూర్య థియేటర్స్ అసోసియేషన్ ని ఎదురించి తాను నిర్మాతగా.. తన భార్య [more]
సూర్య అంటే ఇప్పుడు తమిళ థియేటర్స్ అసోసియేషన్ మండలి వారు బాగా మండిపడుతున్నారు. ఎందుకంటే సూర్య థియేటర్స్ అసోసియేషన్ ని ఎదురించి తాను నిర్మాతగా.. తన భార్య [more]
సూర్య అంటే ఇప్పుడు తమిళ థియేటర్స్ అసోసియేషన్ మండలి వారు బాగా మండిపడుతున్నారు. ఎందుకంటే సూర్య థియేటర్స్ అసోసియేషన్ ని ఎదురించి తాను నిర్మాతగా.. తన భార్య జ్యోతిక నటించిన పోన్మగళ్ వందాల్ మూవీని ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసాడు. కరోనా లాక్ డౌన్ తో ప్రస్తుతం విడుదల కావాల్సిన సినిమాలన్నీ థియేటర్స్ లోకి రాకుండా వాయిదాలు పడుతున్న టైం లో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వాళ్ళు విడుదల కాబోయే సినిమా నిర్మాతలకు భారీగా గాలం వేస్తున్నారు. కానీ హీరోలు, దర్శకులు ఒప్పుకోకపోయిన,.. నిర్మాతలు టెంప్ట్ అవుతున్నారు.. అయితే తమిళనాట సూర్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది థియేటర్స్ అసోసియేషన్.
సూర్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే… సూర్య సినిమాలు నిషేధిస్తామని బెదిరించినప్పటికీ… సూర్య మాత్రం వారి బెదిరింపులను లెక్క చెయ్యకుండా అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని అందుబాటులోకి తెచ్చాడు. సూర్య తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు. అంతే కాకుండా నా సినిమాలు ప్లాప్ అయినప్పుడు నన్నెవరూ సమర్ధించలేదు, నా బిజినెస్ నేను చేసుకుంటాను. సినిమాలు హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నన్ను ప్రశ్నించడం కామెడీగా ఉంది. అసలు ఇప్పటినుండి నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తాను…. ఓటిటికి తగ్గట్టుగానే నా సినిమాలకు బడ్జెట్ పెడతాను… అసలు నాకు 70 కోట్ల అప్పు ఉండబట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అంటూ మాట్లాడడంతో.. నిజంగానే సూర్య అప్పుల పాలయ్యాడు.. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని అంటున్నారు.