Mon Dec 23 2024 05:59:29 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ భారతీయ చిత్రానికి కొత్త.. భారతీయులకు కాదు
మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తీయబడిన ఇంగ్లీష్ సినిమా గాంధీ. ఆ తర్వాత 1992లో అప్పటి దర్శక దిగ్గజంగా పేరొందిన..
విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రముఖు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆస్కార్ అవార్డు అందుకున్నందుకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆస్కార్ విషయానికొస్తే.. ఈ అవార్డు భారతీయ చిత్రీనికి కొత్త కావచ్చు కానీ.. భారతీయులకు కొత్తకాదు. గతంలోనే భారతీయులు ఆస్కార్ లు అందుకుని చరిత్ర సృష్టించారు.
1982లో విడుదలైన గాంధీ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా భాను అథయ్యా తొలి ఆస్కార్ ను అందుకుని రికార్డు సృష్టించారు. మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తీయబడిన ఇంగ్లీష్ సినిమా గాంధీ. ఆ తర్వాత 1992లో అప్పటి దర్శక దిగ్గజంగా పేరొందిన సత్యజిత్ రే సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తించి ఆస్కార్ కమిటీ ఆయనకు గౌరవ పురస్కారాన్ని అందించింది. 81వ ఆస్కార్ వేడుకల్లో.. భారత సినిమా అయిన స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకి ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతానికి రెండు విభాగాల్లో ఆస్కార్ లు వరించాయి.
ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆ సినిమా రెండు ఆస్కార్లను తెచ్చిపెట్టింది. ఇది కూడా ఇంగ్లీష్ సినిమానే. బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ విభాగంలో రసూల్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రచయిత గుల్జార్ ఆస్కార్ ను అందుకున్నారు. 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో గునీత్ మోంగా నిర్మించిన పీరియడ్..ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్ కీ ఆస్కార్ దక్కింది. రెండుసార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా గునీత్ మోంగా చరిత్ర సృష్టించారు. 2023 ఆస్కార్స్ లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ తరపున ఆమె ఆస్కార్ ను అందుకున్నారు.
Next Story