Mon Dec 23 2024 17:53:17 GMT+0000 (Coordinated Universal Time)
"ది ఘోస్ట్" ఓటీటీ పార్ట్ నర్ లాక్
నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో..
అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా "ది ఘోస్ట్". దసరా సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు ప్రవీన్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమాలో.. నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో మంచి టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ది ఘోస్ట్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా చిత్ర యూనిట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందట. గుల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
Next Story